Friday, May 17, 2024

KTR: హైదరాబాద్ ఫార్మాస్యూటికల్స్ క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో భారీ మహిళా పారిశ్రామిక పార్కును మహిళా ఎంటర్ప్రె న్యూర్ తో కలిసి రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘనంగా ప్రారంభించారు. మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ 50 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్కును ఏర్పాటు  చేశారు. ఈ పార్కును మహిళా పారిశ్రామిక వేత్తలతో కలసి మంత్రి ఘనంగా ప్రారంభించారు. అనంతరం మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారతకు పెద్ద పీట వేస్తోందని అన్నారు. హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ హాస్పిటల్స్ ఆఫ్ ఇండియాగా మారబోతుంది అన్నారు. ఇందుకోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు వారి ఆధ్వర్యంలో నెలకొల్పాలని పిలుపునిచ్చారు. టీఎస్ ఐపాస్ నుంచి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందనీ సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రంగాలలో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందన్నారు. నగరానికి కూతవేటు దూరంలోనే అన్ని వసతులతో మహిళా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ ఒకప్పుడు భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 12 శాతంగా ఉన్న మహిళలు నేడు 50 శాతంగా పారిశ్రామిక రంగాలలో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ విధంగా మహిళలను ప్రోత్సహిస్తే చాలామంది మహిళలు మాన్యుఫాక్చరింగ్ రంగం వైపు వస్తారని పేర్కొన్నారు. తద్వారా పెద్ద మొత్తంలో లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని విధాల సహకరిస్తుందని కొనియాడారు. మహిళా ఎంటర్ప్రెన్యూర్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిశ్రమలు స్థాపించి ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement