Monday, April 29, 2024

మే 13న అమెజాన్ ప్రైమ్ లో కేజీఎఫ్2 !

ఓ ప‌క్క సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది కేజీఎఫ్2 చిత్రం. అయితే అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంద‌ట‌.ఈ చిత్రం మొద‌టి రోజే 130కోట్ల క‌లెక్ష‌న్ల‌ను సాధించి హైయెస్ట్ డే1 రికార్డుల‌లో మూడో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్‌లో వాళ్ళ సినిమాల‌ను సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. య‌ష్ న‌ట‌న‌, అభిన‌యానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌కు సినీప్ర‌ముఖులు సైతం జైజైలు కొడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధంచిన డిజిట‌ల్ డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కేజీఎఫ్-2’ చిత్రాన్ని విడుద‌ల‌కు నాలుగు వారాల త‌ర్వాత అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయాల‌ని మేక‌ర్స్ డీల్‌ను కుదిరించుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలో చాప్ట‌ర్‌-2 చిత్రాన్ని మే 13న ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ చిత్రంలో య‌ష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement