Saturday, May 4, 2024

విడాకుల‌పై కేర‌ళ హైకోర్టు.. కీల‌క తీర్పు

సంప్ర‌దాయాల‌కు నెల‌వైన భార‌త‌దేశంలో కూడా విడాకుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. ఒకరి స్వేచ్ఛను మరొకరు కట్టడి చేయకూడదనే భావనతో కోర్టులు సైతం విడాకుల విషయంలోనూ సానుకూలత చూపిస్తున్నాయి. మహిళలు సైతం సొంతం నిర్ణయాలు తీసుకునే స్థాయికి.. ఒకరిపై ఆధారపడి జీవించే స్థాయికి ఎదిగారు. మగవాళ్లకు తామేమీ తీసిపోమనే భావన వారిలో ఇటీవలి కాలంలో బలంగా నాటుకుపోతుంది.కాగా వ్యక్తిగత స్వేచ్ఛ ఇరువురిలోనూ పెరగడంతో ఇది కాస్తా అక్రమ సంబంధాలకు సైతం దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో పెళ్లి బంధం క్రమంగా బీటలు వారుతోంది. విడిపోవాలని జంటలు ఫిక్సయిన తర్వాత విడాకులు ప్రాసెస్ అనేది చాలా జఠిలంగా మారుతోంది. పలుసార్లు కౌన్సిలింగ్.. వాయిదాల పేరుతో జంటలను లాయర్లు.. కోర్టులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విడిపోయే జంట ఆర్నెళ్లు కలిసి ఉండాలనో.. లేదంటే సంవత్సరం పాటు విడిగా ఉండాలనో నిబంధనలు సైతం ఆ జంటలకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.

హిందూ వివాహ చట్టం.. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భార్యభర్తలు విడాకుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే క్రైస్తవ వివాహ చట్టంలో దీనికి తావు లేకుండా పోయింది. కైస్త్రవ చట్టం 1869 నిబంధనల ప్రకారం విడాకులు తీసుకునే జంట కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలి. గతంలో ఈ వ్యవధి రెండేళ్లు ఉండేది. అయితే విడాకుల కోసం ఏడాది విడిగా ఉంటే సరిపోతుందని 2010లో నిబంధనలను కేరళ హైకోర్టు సవరించింది.తాజాగా అదే నిబంధనను అదే కోర్టు కొట్టివేసింది. విడాకులు కోరే దంపతులు ఖచ్చితంగా విడిగా ఉండాలన్న నిబంధనేమీ లేదని.. ఇది విడాకులను నియంత్రించే విధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. అందుకే ఏడాది పాటు విడిగా ఉండాలన్న నిబంధనను కొట్టి వేస్తున్నట్లు కేరళ హైకోర్టు విడాకులపై కీలక తీర్పును వెలువరించింది. దీంతో క్రైస్తవులు సైతం ఎప్పుడంటే అప్పుడు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కే ఛాన్స్ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement