Sunday, April 28, 2024

సీపీఎం ఒక కుల గజ్జి, ఆధిపత్య వాద పార్టీ.. కేరళ లీడర్​ కుమార్తె సంచలన కామెంట్స్​..

కేరళలోని ప్రముఖ సీపీఎం లీడర్​ ఎంఎం లారెన్స్ కుమార్తె ఆశా లారెన్స్ ఆ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో పెను తుపాను కలిగిస్తున్నాయి. ‘‘సీపీఎం అంటే ఏదో అనుకున్నా.. ఇది ప్రపంచంలోనే అత్యంత కులతత్వ.. ఆధిపత్యవాద (హెజెమోనిక్) రాజకీయ సంస్థ’’ అని ఆశా కామెంట్​ చేశారు. మొన్న తలస్సేరిలో హరిదాస్ అనే కార్యకర్త హత్యకు గురైన తర్వాత పార్టీ సీనియర్ నాయకుడు ఎంవీ జయరాజన్ చేసిన ప్రకటనపై ఆశా తన సోషల్ మీడియా పోస్ట్ లో ఇలా స్పందించారు. మత్స్యకారుడైన హరిదాస్‌ హత్య ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధిపత్యాన్ని, మత్స్యకారుల పట్ల దాని వైరాగ్యాన్ని తెలియజేస్తోందని జయరాజన్ ఆరోపించారు.

కాగా దీనిపై ఆశా రిప్లయ్​ ఇస్తూ.. ‘‘నేను CPI (M) కార్యకర్తల నుండి కులపరమైన వ్యాఖ్యలు విన్నాను. TJ అంజలోస్‌ను కేవలం మత్స్యకారుడిగా పిలిచినది BJP కాదు, CPI (M) నాయకుడు VS అచ్యుతానందన్. ఇది అవమానకరం” అని ఆశా తన పోస్టులో రాసుకొచ్చింది. పార్టీ కార్యకర్తలు తమ పేర్లతో కాకుండా వారి కులంతోనే పరిచయం చేసుకుంటారని.. తోటి సహచరుల ప్రవర్తనను సాకుగా చూపేందుకు కులాన్ని ఉపయోగించారని ఆశా పేర్కొంది, తమ మనస్సాక్షికి అబద్ధాలు చెప్పవద్దని సీపీఐ(ఎం)ని ఆమె కోరారు. కిజక్కంబళంలో సీపీఐ (ఎం) కార్యకర్తలు డాయిల్ట్ కార్యకర్తపై దాడి చేసిన ఘటనను కూడా ఆమె ఎత్తి చూపారు. కాగా, ఆశా లారెన్స్ పై  వివాదాలు రావడం ఇదే మొదటిసారి కాదంటున్నారు పొలిటికల్​ అనలిస్టులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement