Tuesday, April 30, 2024

కేజ్రీవాల్ కీల‌క నిర్ణ‌యం – రాజ్య‌స‌భ‌కి ‘హ‌ర్భ‌జ‌న్ సింగ్’

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. త‌మ పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు టీమిండియా మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ని నామినేట్ చేయాల‌ని..అలాగే స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీలో కీల‌క బాధ్య‌త‌లు కూడా అప్ప‌జెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే పంజాబ్ సీఎంగా భ‌గ‌వంత్ మాన్ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత ఆప్ అధిష్ఠానం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. లెక్క‌ల ప్ర‌కారం రాజ్య‌స‌భలో ఆప్‌కు ఐదు సీట్లు ద‌క్కుతాయి. మొట్ట మొద‌ట‌గా హ‌ర్భ‌జ‌న్ పేరునే కేజ్రీవాల్ ఖాయం చేసిన‌ట్లు టాక్. అతి త్వ‌ర‌లోనే కేజ్రీవాల్ హర్భ‌జ‌న్‌ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌నున్నారు.మార్చి 10న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేయడం ద్వారా భగవంత్ మాన్‌కు అభినందనలు తెలిపారు. భగవంత్ మాన్ తల్లిని కౌగిలించుకున్న చిత్రాన్ని పంచుకుంటూ, “కొత్త ముఖ్యమంత్రి అయినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి, నా స్నేహితుడు భగవంత్ మాన్‌కు అభినందనలు. ఖట్కర్‌కలన్ గ్రామంలో భగత్ సింగ్‌లో ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించి రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 117 సీట్లలో ఆప్ 92 సీట్లు గెలుచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement