Saturday, May 4, 2024

ShivSena: బీజేపీ వ్యతిరేక కూటమిలో సీఎం కేసీఆర్ కీలకం

బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలకమని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. అలాగే శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ల పేర్లను ప్రస్తావించింది. కూటమి ఏర్పాటుకు ఈ సమర్థవంతమైన నేతలు చర్చించుకోవాలని సూచించింది. ఆరు ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి అని తెలిపింది. కాంగ్రెస్‌ అసమర్థత వల్లే బీజేపీ గెలుపొందిందని అభిప్రాయపడింది.

కాగా, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా మూడో కూటమి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఆయన పలు జాతీయ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోనూ గత ఫిబ్రవరిలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. దేశంలో గుణాత్మక‌మైన మార్పు అవ‌స‌రం అందని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో క‌లిసి పని చేయాల‌ని నిర్ణయించామన్న కేసీఆర్.. త్వర‌లో హైద‌రాబాద్‌లో లేదా మ‌రో చోట‌ అంద‌రం నేత‌లం క‌లుస్తామన్నారు. భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement