Tuesday, May 7, 2024

కథక్ మాస్ట్రో పండిట్ బిర్జూ మహారాజ్ ఇకలేరు.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

కథక్ లెజెండ్ పండిట్ బిర్జు మహారాజ్ గుండెపోటుతో ఆదివారం అర్థరాత్రి ఢిల్లీలోని తన స్వగృహంలో చనిపోయారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ గ్రహీత ఆయన. అతని శిష్యులు,అనుచరులచే అభిమానంతో పండిట్-జీ అని..మహారాజ్-జీ అని పిలుస్తారు.భారతదేశంలోని అత్యుత్తమ కళాకారులలో ఈయన ఒకరు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి బిర్జూ మహారాజ్ తన మనవళ్లతో ఆడుకుంటున్న సమయంలో అతని ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

కొద్దిరోజుల క్రితం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బిర్జు మహారాజ్ డయాలసిస్‌ చేయించుకున్నారు. బిర్జు మహారాజ్ కథక్ నృత్యకారుల మహారాజ్ కుటుంబానికి చెందినవారు, ఇదే కళను నమ్ముకుని అతని ఇద్దరు మేనమామలు, శంభు మహారాజ్, లచ్చు మహారాజ్ తో పాటు అతని తండ్రి, గురువు అచ్చన్ మహారాజ్ ఉన్నారు. కథక్ లెజెండ్ కూడా ఒక అద్భుతమైన డ్రమ్మర్. దాదాపు అన్ని డ్రమ్స్ లను సులభంగా, కచ్చితత్వంతో వాయించేవాడు. అతని అధికారిక వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం… అతనికి తబలా, నాల్ వాయించడం అంటే చాలా ఇష్టం.

కాగా, పండిట్ బిర్జూ మహారాజ్ లక్నోలోని కల్కా-బిందాదిన్ మహా విద్వంసుడు. ‘ప్రదర్శక కళల రంగంలో అసమానమైన వ్యక్తిని కోల్పోయాం.. తన మేధాశక్తితో ఎన్నో తరాలను ఆయన ప్రభావితం చేశారు’ అంటూ సింగర్ అద్నాన్ సమీ ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement