Friday, April 26, 2024

కాంతార మూవీ రివ్యూ – అదరగొట్టిన రిషబ్ శెట్టి

కన్నడ చిత్రం కాంతారని తెలుగులో అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత చకచకా సినిమాను సిద్ధం చేసి తన బేనర్ ద్వారా శనివారం ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా వుందో తెలుసుకుందాం..

కథ ఏంటంటే – అడవికి ఆనుకుని ఉండే ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఒక దైవదూత సూచన మేరకు తన ఐదొందల ఎకరాల భూమిని గిరిజనులకు రాసిచ్చేస్తాడు. కాల క్రమంలో అతడి వారసుడొకరు ఆ భూమిని తనకి ఇచ్చేయాలని గిరిజనుల మీద ఒత్తిడి తెస్తాడు. కానీ అతను అనూహ్య పరిణామాల మధ్య రక్తం కక్కుకుని చనిపోతాడు. ఇంకో తరం మారాక ఆ చనిపోయిన వ్యక్తి కొడుకైన దేవేంద్ర (అచ్యుత్ కుమార్) గిరిజనులతో సన్నిహితంగా మెలుగుతుంటాడు. అతడి దగ్గర పని చేస్తూ తన ఊరి వాళ్లకు తలలో నాలుకలా ఉండే శివ (రిషబ్ శెట్టి)కి.. కొత్తగా అటవీ అధికారిగా వచ్చిన మురళి (కిషోర్)కి తగువు మొదలవుతుంది. కొన్ని పరిణామాల తర్వాత శివ సోదరుడు చనిపోతాడు. అతణ్ని చంపింది మురళీనే అనుకుంటాడు శివ. కానీ అసలు కథ వేరే అని తర్వాత తెలుస్తుంది. ఇంతకీ శివ సోదరుడిని చంపిందెవరు.. అందుకు కారణమేంటి.. బదులుగా శివ ఏం చేశాడు అన్నది మిగతా కథ.

- Advertisement -

విశ్లేషణ – ఒక సినిమా గురించి మాట్లాడేటపుడు మొదట్నుంచి ఆరంభించాలి కానీ.. కాంతార విషయంలో మాత్రం పతాక ఘట్టం గురించే ప్రస్తావించాలి. గత రెండు వారాలుగా దీని గురించి జరుగుతున్న చర్చలో అతిశయోక్తి ఏమీ లేదు. ముందే భారీ అంచనాలు పెట్టుకుని వెళ్లినా ఇందులోని పతాక సన్నివేశాలు కచ్చితంగా ప్రేక్షకులకు ఆశ్చర్యానుభూతి కలిగిస్తాయి. అందులో రిషబ్ శెట్టి పెర్ఫామెన్స్ చాలా కాలం గుర్తుండి పోతుంది. అప్పటిదాకా సినిమా ఎగుడుదిగుడుగా సాగినా సరే.. క్లైమాక్సుతో కడుపు నిండి సంతృప్తిగా బయటికి వస్తారు ప్రేక్షకులు.
ఆ సన్నివేశాలు ఇచ్చే హైతో కాంతారకు మన మనసుల్లో ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేస్తాం. క్లైమాక్సులో ప్రేక్షకులు షాకైపోయేలా.. సంచలన రేతిలో ఏమీ జరిగిపోదు కానీ.. ఆ ఎపిసోడ్ ను తీర్చిదిద్దిన విధానంలోనే ఒక ప్రత్యేకత ఉంది. కాంతారకు అదే మేజర్ హైలైట్. పతాక సన్నివేశాలిచ్చే హై వల్ల ముందు వచ్చే రిపీటెడ్.. బోరింగ్ సన్నివేశాలను మన్నించవచ్చు.

నటీనటులు – కాంతార సినిమా చూశాక ఎవ్వరైనా రిషబ్ శెట్టి ఫ్యాన్ అయిపోవాల్సిందే. శివ అనే సగటు కుర్రాడిలా అతడి నటన మామూలే కానీ.. కోళం ఆట ఆడే దైవదూత పాత్రలో అతడి అప్పీయరెన్స్.. పెర్ఫామెన్స్ చాన్నాళ్లు గుర్తుండి పోతుంది. అచ్యుత్ కుమార్ దొర పాత్రలో అదరగొట్టాడు. అటవీ అధికారిగా కిషోర్ కూడా ఆకట్టుకున్నాడు. హీరో పక్కన మిడిలేజ్డ్ క్యారెక్టర్లో చేసిన నటుడు బాగానే నవ్వులు పంచాడు. మిగతా నటీనటులంతా ఓకే. వీటన్నింటికీ మించి హీరో పాత్ర విశ్వరూపం.. అందులో రిషబ్ శెట్టి మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ వల్ల సినిమా ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకుంటుంది.

సాంకేతికత -కాంతారకు సాంకేతిక ఆకర్షణలు బాగా కుదిరాయి. అజ్నీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. పాటలు ఓకే. అరవింద్ కశ్యప్ ఛాయాగ్రహణం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. హోంబళె ఫిలిమ్స్ స్థాయికి తగ్గట్లు నిర్మాణ విలువలు ఉన్నాయి. కిరిక్ పార్టీ లాంటి కాలేజ్ లవ్ స్టోరీతో మంచి పేరు సంపాదించిన రిషబ్ శెట్టి.. కాంతారతో దర్శకుడిగా చాలా మెట్లు ఎక్కాడు. కర్ణాటకలోని ఒక ఆచారాన్ని నేపథ్యంగా తీసుకుని యూనివర్శల్ అప్పీల్ వచ్చేలా ఈ కథను అతను తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. ఓవైపు లీడ్ రోల్ చేస్తూనే కన్ఫ్యూజన్ లేకుండా తన స్క్రిప్టును తెరపై ప్రెజెంట్ చేశాడు.చివరి 20-25 నిమిషాల్లో కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలు.. అద్భుతమైన సినిమాటోగ్రఫీ.. ఒళ్లు జలదరించేలా చేసే నేపథ్య సంగీతం..

Advertisement

తాజా వార్తలు

Advertisement