Wednesday, May 1, 2024

క‌న్న‌డ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆఖ‌రి చిత్రం – ‘జేమ్స్’ రేపే విడుద‌ల‌

దివంగ‌త క‌న్న‌డ‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ న‌టించిన ఆఖ‌రి చిత్రం జేమ్స్. రేపు మార్చి 17న ఈ చిత్రం పెద్ద ఎత్తున థియేట‌ర్స్ లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో స్వర్గీయ్ పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, అను ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్. శరత్ కుమార్, హరీష్ పెరడి, తిలక్ శేఖర్, ముఖేశ్ రిషి, ఆదిత్య మీనన్, రంగయణ రఘు సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. చేతన్ కుమార్ ఈ మూవీకి కథ అందించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. కిశోర్ పత్తికొండ కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు. చరణ్ రాజ్ సంగీతాన్ని సమకూర్చగా స్వామి జె. గౌడ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు. జేమ్స్ ఒక కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా చెప్పుకోవచ్చు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇందులో జె వింగ్స్ సీక్రెట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఆఫీసర్ సంతోష్ జేమ్స్ కుమార్ పాత్రలో నటించారు. మూవీలో ప్రత్యేకత ఏమిటి అంటే పునీత్ రాజ్ కుమార్ అన్ని శివరాజ్ కుమార్ ఈ సినిమాకు వాయిస్ అందించారు. ప్రియా ఆనంద్ జేమ్స్ లవర్ నిషా గయక్వాడ్ పాత్రలో నటించింది. బ్లాక్ మార్కెట్, కరప్షన్, స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతాయి. వీటిని ఎదుర్కొనడానికి ప్రభుత్వంలోని పోలీస్ రక్షణ వ్యవస్తలో జేమ్స్ వింగ్ అనే ఓ సీక్రెట్ ఏజెన్సీ రన్ అవుతుంది. ఈ సీక్రెట్ ఎజెన్సీని జేమ్స్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్) లీడ్ చేస్తాడు. కథ మొత్తం దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement