Friday, April 26, 2024

స‌ర్కార్ వారి పాట నుండి ‘క‌ళావ‌తి’ వీడియో సాంగ్ రిలీజ్

స‌ర్కార్ వారి పాట చిత్రం నుండి క‌ళావ‌తి వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని ప‌రుశురాం తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు,కీర్తి సురేశ్ న‌టిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ , గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది.ఈ సినిమాలోని మొదటి పాటను లవర్స్‌ డే ఉన్న నేపథ్యంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ మేరకు ఇవాళ సాంగ్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో మహేష్‌ బాబు చాలా హ్యండ్‌ సమ్‌ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా చాలా క్యూట్ గా కనిపిస్తుంది. మొత్తానికి ఈ పాటలో మహేష్, కీర్తి మధ్య కెమిస్త్రీ బాగ్ వర్క్ అవుట్ అయింది. కాగా ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement