Monday, April 29, 2024

భర్త ఇచ్చేది చాలడం లేదని.. తమ్ముడితో కలిసి పాడు పని..

భ‌ర్త ఇచ్చేది చాల‌డం లేద‌ని ఓ మ‌హిళ త‌న టీనేజీ త‌మ్ముడితో క‌లిసి పాడు ప‌నిచేసింది. పైగా.. తాను అలా ఎందుకు దిగజారాల్సి వచ్చిందో అనేదానిపై కోర్టులో చెప్పిన‌ వివరణ సంచలనంగా మారింది. నేరం నాది కాదు పరిస్థితులది అంటూ సినిమాల్లో చెప్పిన‌ట్టున్న‌ ఈ రియల్ లైఫ్ కిలేడి కోర్టు శిక్ష నుంచి తప్పించుకోవాలని చూసింది. చిన్న పిల్లాడిని వెంటేసుకుని, కడుపులో మరో బిడ్డను మోస్తూ ఆమె చేసిన తప్పుడు పని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావ‌డంతో త‌ప్పించుకునే మార్గం లేకుండాపోయింది.

అస‌లేం జ‌రిగిందంటే..
పంజాబ్ లోని లూథియానా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. టీనేజ్ తమ్ముడు సహాయం రాగా, చంటి పిల్లాడిని వెంట పెట్టుకుని నగల దుకాణంలోకి వెళ్లింది ఓ మహిళ. గర్భిణి కావడంతో ఆమెను తొందరగా పంపించేయాలనే ఉద్దేశంతో అడిగిన మోడ‌ల్స్ అన్నీ తీసి చూపించాడు షాపువాడు. గంటసేపు చూసి ఏ ఒక్కటీ నచ్చలేదని చెప్పి వెళ్లిందా మ‌హిళ‌. మ‌రుస‌టి రోజు నగల లెక్కల్లో తేడా గమనించిన షాపు వాడు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకున్నాడు. దీంతో సదరు మహిళ చేతివాటం క‌నిపించింది. ఏకంగా నాలుగు గోల్డ్ చైన్లను చోరీ చేసినట్లు తేలింది. పోలీసుల‌కు కంప్లేంట్ చేయ‌డంతో ఆ కిలేడీ కోసం ఆరాతీశారు. నాలుగు రోజుల త‌ర్వాత చిక్కిన ఆమెను, సహనిందితుడైన తమ్ముణ్ని పట్టుకున్నారు. అయితే, ఈ కేసు ఈమ‌ధ్య‌నే కోర్టు ముందుకువ‌చ్చింది. విచారణలో నిందితురాలు చెప్పిన మాటలు కలకలం రేపాయి. నిందితురాలు గర్భిణి కావడంతో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జడ్జి ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

రజనీ శర్మ అనే 24ఏళ్ల మహిళ భర్తతో కలిసి ఫతేగఢ్ సాహిబ్ లో నివసిస్తోంది. వారికి ఇప్పటికే నాలుగేళ్ల బాబు ఉన్నాడు. ఆమె మ‌ళ్లీ గర్భందాల్చింది. వాళ్లకు సహాయంగా రజనీ తమ్ముడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. మొన్న అక్టోబర్ 9న లూథియానా సిటీకి వచ్చిన రజనీ శర్మ ఓ జువెలరీ షాపులో చోరీకి పాల్పడింది. సీసీటీవీ రికార్డుల ఆధారంగా ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.

చంటి పిల్లాడిని, తమ్ముడిని అడ్డం పెట్టుకుని రజనీ చోరీకి పాల్పడిన దృశ్యాలు, ఆమె నుంచి రికవరీ చేసిన నగలను సాక్ష్యాలుగా కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కాగా, తన భర్త రోజు కూలీ అని, అతను ఇచ్చే డబ్బులతో ఇల్లు గడవటం లేదని, అనివార్య పరిస్థితుల్లోనే దొంగతనం చేయాల్సి వచ్చిందని నిందితురాలు జడ్జికి వివరించింది. కానీ, కోర్టువారు ఈ కాక్ అండ్ బుల్ స్టోరీకి కరిగిపోలేదు. పేదరికాన్ని సాకుగా చెబితే దేశంలో నూటికి నలభై మంది పేదలే క‌దా అని ప్రాసిక్యూటర్ వాదించారు. చివరికి ఆమె రిమాండ్ విధించిన కోర్టు.. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఆమెతోపాటు దొంగతనంలో పాలుపంచుకున్న తమ్ముడిని జువెనైల్ హోంకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement