Friday, April 26, 2024

క‌ర్నూల్ లో జూన్ 5న – విరాట‌ప‌ర్వం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

క‌ర్నూల్ లో జూన్ 5న విరాట‌ప‌ర్వం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. హీరో రానా ప్ర‌ధాన‌పాత్ర‌ని పోషిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘విరాటపర్వం’ సినిమా నిర్మితమైంది. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 1990 నాటి నక్సలిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నక్సలైట్ నాయకుడిగా ఈ సినిమాలో రానా కనిపించనున్నారు. ఆయనను ఆరాధించే యువతిగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీని .. వేదికను ఖరారు చేశారు. ఆదివారం జూన్ 5న‌ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ‘కర్నూల్’ లో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చారు. ప్రియమణి .. నందితా దాస్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement