Monday, April 29, 2024

ఎన్టీఆర్‌ చేతికి గాయం.. ఏం జరిగిందంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ ఎన్టీఆర్ గాయపడ్డారు. వర్కౌట్స్ చేస్తుండగా ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు గాయం అయ్యింది. ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ  చేశారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తారక్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోలో తారక్ చేతికి గాయం అయినట్టు కనిపిస్తుంది. ఎన్టీఆర్ చేతికి గాయం అయిన విషయం తెలిసి అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు.

ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఇక, కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమాను త్వరలో ప్రారంభించనున్నారు. జనతాగ్యారేజ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ రిపీట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: నెల్లూరులో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత

Advertisement

తాజా వార్తలు

Advertisement