Sunday, April 28, 2024

Spl Story | జర్నీ టు జంగిల్​.. పులిని మరీ దగ్గరినుంచి చూడొచ్చు (వీడియో)

వానాకాలం సీజన్​ ప్రారంభం కావడంతో హైదరాబాద్​ సిటీ జనం రిఫ్రెష్​మెంట్​, రిలాక్సింగ్​ కోసం అన్వేషిస్తుంటారు. చాలామంది సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్​ చూపుతారు. అందులోకి ఇంకొంతమంది ప్రకృతిని, వన్యప్రాణులను చూడ్డానికి ఆసక్తి కనబరుస్తారు. ఇట్లాంటి వారికోసం ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ ఓసరికొత్త డెస్టినేషన్​ పాయింట్​ని తీసుకొస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వన్యప్రాణులను వాటి ఆవాసా ప్రాంతాలకు వెళ్లి చూడాలంటే కచ్చితంగా జంగిల్ సఫారీ చేయాల్సిందే. ఇట్లాంటి గొప్ప అనుభూతిని ఎక్స్​పీరియన్స్​ చేయాలంటే చాలా ఎక్కువ దూరం జర్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. త్వరలోనే అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్ ప్రారంభం కానుంది. కోరుకున్న ప్రకృతిని, వన్యప్రాణుల చూసి సంతోష పడే అవకాశం దక్కనుంది.

హైదరాబాద్ నుండి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైన టైగర్ రిజర్వ్ ఉంది. ఇది ఫారెస్ట్​ అందాలతో మునిగి తేలడంతోపాటు.. వన్యప్రాణుల సహజ ఆవాసాల్లో ఉన్న పలు రకాల జంతువులు, గంభీరమైన పులులను చూసేందుకు ఒక బెస్ట్​ ప్లేస్​గా మారనుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో 2,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గతంలో ‘నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌గా పిలువబడే ఈ పర్యావరణ-పర్యాటక ప్రదేశాన్ని నిజాం రాజులు ఎక్కువగా ఉపయోగించారు. వారు పులులను గుర్తించడానికి.. అటవీ జంతువులను వేటాడేందుకు అడవిలోని ఈ ఏరియాల్లో సందర్శించేవారు. కాబట్టి, ఈ టైగర్ రిజర్వ్ చరిత్ర పర్యావరణ ప్రేమికులకు కూడా సరైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.

జంగిల్ సఫారి సమయాలు .. ఖర్చు వివరాలు

- Advertisement -

ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ ఈ రిజర్వ్ సఫారీలను నిర్వహించనుంది. ఇది ఓపెన్​ జీప్‌లో సుందరమైన అటవీ టూరిజాన్ని చూసేందుకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అడవిలోని ఈ భాగంలో 28 కంటే ఎక్కువ పులులు, చిరుతలు, జింకలు ఉన్నాయి. ఇక ఈ సఫారీలో వ్యూపాయింట్ వంటివి కూడా ఎంతో అద్భుత ప్రదేశంగా ఉంటుంది. ఈ వ్యూ పాయింట్​ నుంచి వందల ఎకరాల అడవిని చూడొచ్చు.

ఇక.. ప్రయాణం కూడా చాలా తేలికగా ఉంటుంది. సఫారీని కేవలం ఒక్కొక్కరికి 200 రూపాయలు మాత్రమే చార్జ్​ చేయనున్నారు. టైగర్ రిజర్వ్ లో జంతువులను చూడ్డానికి ఉదయం 7 నుంచి -9 లేదా, సాయంత్రం 4 నుంచి -6 గంటల మధ్య వెళ్లాల్సి ఉంటుంది.

మీలో ఉన్న సాహస ప్రియులను శాంతింపజేయాలనుకుంటే.. ఒంటరిగా లేదా, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు విహారయాత్ర చేయొచ్చు. ఈ జంగిల్ సఫారీ ఒక మరపురాని అనుభూతిని అందిస్తుంది. పచ్చదనంతో కూడిన అటవీ అందాలను చూస్తూనే.. అద్భుతమైన జీవులను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement