Monday, April 29, 2024

జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు కేంద్రం ఆమోదం

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు జారీ చేసింది. అత్య‌వ‌స‌ర వినియోగం కింద ఆ టీకాల‌ను ఇవ్వ‌వ‌చ్చు అని శనివారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించారు. దీంతో భార‌త్ త‌న వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని పెంచేసింది.

జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌కు అత్య‌వ‌స‌ర వినియోగం కోసం ఆమోదం ద‌క్క‌డంతో.. భార‌త్‌లో వినియోగించ‌నున్న 5వ టీకా కానుంది. యూరోపియ‌న్ యూనియ‌న్ ఏజెన్సీ ఆమోదం పొందిన 5 టీకాలు మ‌న వ‌ద్ద ఉన్న‌ట్లు కేంద్ర మంత్రి మన్సూక్ మాండవీయ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. జాన్స‌న్ సింగిల్ డోసు రాక‌తో.. కోవిడ్‌పై పోరాటం మ‌రింత బ‌లోప‌తం అవుతుంద‌ని ఆయన తెలిపారు. దేశ‌వ్యాప్తంగా ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవీషీల్డ్‌, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం ద‌క్కిన విష‌యం తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: ముంబైలోని అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement