Friday, May 10, 2024

TS: నిరుద్యోగులకు తీపి కబురు

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో తీపి క‌బురు అందించింది. మొన్న కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి, నిన్న గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన విష‌యం విదిత‌మే. తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల 614కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు కాగా, మిగ‌తా 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భ‌ర్తీకి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement