Wednesday, May 1, 2024

Jharkhand: భర్తను కొట్టి, భార్యపై గ్యాంగ్​రేప్​.. దారుణానికి పాల్పడ్డ ఆరుగురు దుండగులు!

ఇంట్లో అత్తా మామలతో గొడవపడి తల్లిగారింటికి వెళ్తున్న ఓ మహిళను ఆరుగురు మృగాళ్లు దారుణంగా రేప్​ చేశారు. అయితే.. ఆ మహిళను వెతుక్కుంటూ వెళ్లిన భర్తను, అతనితోపాటు ఉన్న బంధువును తాళ్లతో బంధించి, కర్రలతో తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. అంతేకాకుండా భర్త చూస్తుండగానే ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటన జార్ఖండ్​లో జరిగింది. ఇవ్వాల నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో 22 ఏళ్ల మహిళపై ఆమె భర్త ఎదుట ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇవ్వాల (సోమవారం) పోలీసులు తెలిపారు. ఈ ఘటన సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బకోరియా భలువాహి లోయ సమీపంలో జరిగిందని పాలము ఎస్పీ చందన్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ దారుణానికి పాల్పడ్డ ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

పలాము జిల్లాలోని పటాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని తన అత్తమామల ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఆ మహిళ శనివారం కాలినడకన లాతేహార్ జిల్లాలోని మానికా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని తన తండ్రి ఇంటికి బయలుదేరింది. అయితే.. ఆమెను వెతకడానికి భర్త, అతని బంధువులలో ఒకరు మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. ఆమె రాత్రి 8 గంటల సమయంలో సత్బర్వా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జాతీయ రహదారి 39 వెంబడి నడుచుకుంటూ వెళ్తోంది.

ఈ క్రమంలో భార్యను ఇంటికి రావాలని బతిమాలుకుంటున్నాడు. ఇంతలో ఆరుగురు వ్యక్తులు మోటారు సైకిళ్లపై వచ్చి అతనిని, అతని బంధువును తీవ్రంగా కొట్టి అతని భార్యను పక్కనున్న చెట్ల చాటుకు తీసుకువెళ్లారు. అక్కడ అతను చూస్తుండగానే.. ఆమెపై అత్యాచారం చేశారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు తనకు తెలుసని ప్రాణాలతో బయటపడిన భర్త పేర్కొన్నాడు.

- Advertisement -

ఇక.. తీవ్రంగా కొట్టడంతో అతని బంధువు స్పృహ కోల్పోయాడు. అంతలోనే మోటారుసైకిల్‌పై భార్యను మరొక చోటుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకునే యత్నం చేసినా మరోసారి కొట్టారు. ఈ క్రమంలో వారు వెళ్తున్న బైక్​ ఓ వాహనాన్ని ఢీకొట్టింది. మహిళ కూడా గట్టి అరవడంతో ఆమె కేకలు విన్న స్థానిక గ్రామస్థులు అక్కడికి వచ్చి రక్షించి ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మిగిలిన నలుగురు తప్పించుకున్నారు. నిందితుల్లో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేయగా.. మరో నలుగురిని సోమవారం పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అయితే.. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మేదినీనగర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని సత్బర్వా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రిషికేష్ కుమార్ రాయ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement