Saturday, April 27, 2024

మేజ‌ర్ నుండి జ‌న‌గ‌ణ‌మ‌న వీడియో సాంగ్ – దేశ‌భ‌క్తిని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారుగా

మేజర్ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రం నుండి జ‌న‌గ‌ణ‌మ‌న వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో అడవి శేషు న‌టించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయను న్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెర పై ఆవిష్కరించారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి జనగణమన సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ లో దేశ భక్తి ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement