Thursday, May 16, 2024

జ‌బ‌ర్థ‌స్త్ లో మ‌రింత గ్లామ‌ర్ – జ‌డ్జిగా అందాల తార ఖుష్భూ

బుల్లితెర కామెడీ షోలో మొద‌టిస్థానంలో ఉన్న జ‌బ‌ర్థ‌స్త్ లో ప‌లు మార్పులు జ‌రుగుతున్నాయి.. పార్టిసిపెంట్స్ ద‌గ్గ‌ర నుంచి జ‌డ్జిల వ‌ర‌కు చాలా మంది మారిపోతున్నారు ఈ షోలో. కాగా రీసెంట్ గా అల‌నాటి అందాల న‌టి ఖుష్భూ సంద‌డి చేసింది.అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా ఇప్పుడు విడుదల అయింది. ప్రస్తుతం ఈ ప్రోమోలో పంచ్ డైలాగులు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. ఖుష్బూ గతంలో కంటే ఇప్పుడు ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నది. మరి ఈ షో లో ఎంతవరకు ఖుష్బూ అలరిస్తుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతూ ఉంది. ఇందులో రోజా జడ్జిగా ఉన్నప్పుడు నాగబాబు ఉండేవారు కానీ నాగబాబు కొన్ని కారణాలు చేత ఈ షోని వీడిపోవడంతో.. నాగబాబు ప్లేసులో సింగర్ మనో రావడం జరిగింది. అయితే రోజా కూడా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ గుడ్ బై చెప్పేసింది దాంతో సింగర్ మనో కూడా వదిలేయడం జరిగింది. దీంతో రోజా స్థానంలో హీరోయిన్ ఇంద్రజ రావడం జరిగింది కానీ ఈమె అంతగా ఆకట్టుకోలేక పోతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement