Monday, April 29, 2024

ఐవర్ మెక్టిన్‌తో తగ్గుతున్న కరోనా మరణాల ముప్పు

నోటి ద్వారా తీసుకొనే యాంటీ పారాసైటిక్‌ ఔషధం ఐవర్‌మెక్టిన్‌‌ను తరచూ తీసుకోవడం ద్వారా కరోనా సోకే ముప్పు బాగా తగ్గుతోందని, కరోనా రోగుల్లో మరణ ముప్పు కూడా తగ్గుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. దీనికి సంబంధించిన వివరాలను అమెరికా జర్నల్‌ ఆఫ్‌ థెరప్యూటిక్స్‌ వెల్లడించింది. ఈ మందు కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ఉపయోగపడుతుందని పరిశోధనలో పాల్గొన్న చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పియరీ కోరీ తెలిపారు. ఐవర్‌మెక్టిన్‌పై ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో మొత్తం 27 కంట్రోల్డ్‌ ట్రయల్స్‌ జరిపామని, అందులో 15 రాండమైజ్డ్‌ కంట్రోల్‌ ట్రయల్స్‌ అని పియరీ కోరీ తెలిపారు. మొత్తం 2,500 మంది రోగుల మీద దీన్ని పరీక్షించి ఫలితాలను విశ్లేషించినట్లు వెల్లడించారు. ఇది తీసుకున్న వారిలో మరణాల రేటు తగ్గగా.. రికవరీ సమయం కూడా ఇతరులతో పోలిస్తే తగ్గిందని పేర్కొన్నారు. ఐవర్‌మెక్టిన్‌ వాడితే కరోనా సోకే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని తెలిపారు. ఈ మందును ఇప్పటికే పలు చోట్ల వినియోగిస్తున్నారని, అన్నిచోట్లా ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement