Sunday, April 28, 2024

సోనూసూద్ ను మరోసారి ‘గ్రేట్’ అనాల్సిందే

గతేడాది కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి వారి హృదయాలను గెలుచుకున్నారు సోను సూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి కూడా ఎవరికీ ఎటువంటి సమస్య వచ్చినా సోను సూద్ అండగా నిలబడుతూ వస్తున్నాడు. అయితే తాజాగా మరోసారి ఒక గ్రేట్ మూవ్ తో దేశవ్యాప్తంగా అందరి ఆదరాభిమానాలు పొందాడు. ఫ్రాన్స్ దేశం నుంచి ఏకంగా నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ లను తీసుకొచ్చి భారత్ లో నిలపడానికి పూనుకున్నాడు.

అత్యవసరంగా ఏ రాష్ట్రాల్లో అయితే వాటి అవసరం ఉంటుందో అక్కడ వాటిని స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయమై సోషల్ మీడియాలో సోనూసూద్ పట్ల ప్రశంసలు జల్లు కురుస్తోంది. అలాగే సినిమాల విషయానికొస్తే తెలుగులో ఆచార్య ,హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్నాడు సోనూసూద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement