Monday, May 6, 2024

ఇది నాకు కొత్త జీవితం: కూతురు, భర్తతోనే గడిపేస్తా.. జైలు నుంచి బయటకొచ్చిన నళిని శ్రీహరన్​

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్​ సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం జైలు నుంచి విడుదలైంది. శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషుల్లో నళిని ఒకరు. అయితే.. ఇది తనకు కొత్త జీవితమని, ఇకపై తాను ప్రజా జీవితంలో చేరబోనని తెలిపింది. తన భర్త, కుమార్తెతో ఈ కొత్త జీవితం సంతోషంగా గడుపుతానని చెప్పింది. తాను ప్రజా జీవితంలోకి వెళ్లడం లేదు. 30 ఏళ్లకు పైగా తనను ఆదరించినందుకు తమిళులకు ధన్యవాదాలు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తాను తన కుమార్తెతో మాట్లాడాను..  అని ఆమె చెప్పింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్వేగంగా మాట్లాడింది.

1991లో రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా తేలిన నళినీ శ్రీహరన్‌తో పాటు మరో ఐదుగురిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని తమిళనాడులో చాలా మంది స్వాగతించారు. అక్కడ వారి ఖైదు భావోద్వేగ సమస్యగా ఉంది. ఎందుకంటే దోషులుగా తేలిన ఏడుగురు స్థానికులు ఆ నేరంగ గురించి తెలియకుండానే అందులో భాగమయ్యారని చాలా మంది నమ్ముతున్నారు.

ఖైదీల సత్ప్రవర్తన.. ఈ కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తి ఏజీ పెరరివాలన్ మేలో విడుదల కావడం, అరెస్టు చేసే సమయానికి అతడి వయసు 19 ఏళ్లుగా ఉండడం. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం వంటి అనేక అంశాల ఆధారంగా తమ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.

- Advertisement -

1991 మేలో శ్రీలంకలోని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) చేత తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో మరణించారు. 1987లో భారత శాంతి పరిరక్షక దళాన్ని శ్రీలంకకు పంపిన తర్వాత రాజీవ్ గాంధీ హత్య ప్రతీకార చర్యగా భావించారు. యుద్ధంలో 1,200 మందికి పైగా సైనికులను కోల్పోయిన తర్వాత, శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొన్న తర్వాత వారిని ఉపసంహరించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement