Saturday, May 11, 2024

యూజీ ఆయూష్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. 13 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: యూజీ ఆయూష్‌ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆయూష్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌ కోర్సులల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ శనివారం యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నీట్‌ 2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు ఈనెల 13వ తేది ఉదయం 8 గంటల నుండి 20వతేది రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వారు సూచించారు.

నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించిన అర్హత ఇతర సమాచారాని కి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ WWW.KNRUHS.TELANGANA.GOV.IN లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement