Monday, April 29, 2024

ఐసీసీ చైర్మన్ గా మరోసారి గ్రెగ్ బార్ క్లే నియామకం..

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ గా న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్ క్లే మరోసారి నియమితులయ్యారు. ఆయన ఈ పదవిని చేపట్టడం వరుసగా రెండోసారి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఇవ్వాల (శనివారం) ఐసీసీ భేటీ జరిగింది. ఐసీసీ చైర్మన్ ఎన్నిక నుంచి జింబాబ్వే క్రికెట్ బోర్డు చైర్మన్ డాక్టర్ తవెంగ్వా ముఖులాని తప్పుకోవడంతో గ్రెగ్ బార్ క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో మరో రెండేళ్ల పాటు కొనసాగుతారు.

ఇవాళ్టి ఐసీసీ సమావేశంలో మొత్తం 17 మంది సభ్యుల్లో 12 మందికి పైగా బార్ క్లే నాయకత్వానికి మద్దతు పలికారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తరఫున ఈ సమావేశానికి కార్యదర్శి జే షా హాజరయ్యారు. ఆయన కూడా బార్ క్లేకు మద్దతు పలికారు. గ్రెగ్ బార్ క్లే న్యూజిలాండ్ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు. తొలిసారిగా 2020లో ఐసీసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం ఈ నవంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నిక చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement