Tuesday, April 30, 2024

ఎఫ్3లో ఐటెం సాంగ్ – ఏప్రిల్ 22న లిరిక‌ల్ వీడియో

ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం చిత్రంలో ఐటెమ్ సాంగ్ లో మెరిసింది హీరోయిన్ పూజాహెగ్డే. కాగా ఇప్పుడు ఎఫ్3లో కూడా ఐటెమ్ సాంగ్ చేయ‌నుంది పూజా. ఏప్రిల్ 22న “ఊ ఆ ఆహా” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు పోస్టర్ ని రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రం ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. పూజా హెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు మేకర్స్. ఈ సినిమాలో నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ “డబ్బు” అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కామెడీ మూవీ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రంలో విక్ట‌రీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు..తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. మే 27న “ఎఫ్‌3” ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement