Monday, May 13, 2024

గుజరాత్ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థిగా.. ఇసుధన్ గధ్వి

గుజరాత్ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుధన్ గధ్వి బరిలోకి దిగనున్నారు.ఈ మేరకు ఆప్‌ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు.. గుజరాత్‌ లోని అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను పెట్టి.. గెలవబోతున్నట్లు కూడా ప్రకటించింది. గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు ఫిబ్రవరిలో ముగియనుంది. మామూలుగా గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీతో సీన్ మారే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల లిస్టు విడుదల చేయడంతో గుజరాత్లో ఈ సారి బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య ముక్కోణపు పోటీ ఖాయమనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement