Sunday, May 19, 2024

Breaking: తెలంగాణ కల నెరవేరిందా? ఎవ‌రు ల‌బ్ధిపొందుతున్నారో చెప్పాలే: రాహుల్ గాంధీ

వ‌రంగ‌ల్‌లో కాంగ్రెస్ పార్టీ త‌ల‌పెట్టిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌లో పార్టీ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఆయ‌న మాటల్లోనే.. ప్ర‌సంగం.. ‘‘ఈ రోజు రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌లో పాల్గొన్న కాంగ్రెస్ నేత‌ల‌కు పేరు పేరున‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. మన రాష్ట్రం కొత్త రాష్ట్రం, నవ రాష్ట్రంగా ఏర్పడ్డది. ఇది చాలామంది యువతులు, అమ్మలు, అక్కలు వారి శ్రమ, రక్తంతో, కన్నీళ్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి కోసం ఏర్పడలేదు. ఈ రాష్ట్రం రైతు సోదరులకు, కార్మికులకు, యువతీ యువకులకు ఉందని తెలియజేస్తున్నా.. ఈ రోజు ఎనిమిదేండ్లుగా ప‌రిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి గురించి కొన్ని ప్ర‌శ్న‌లు అడ‌గ‌ద‌లుచుకున్నా.. మ‌నం తెలంగాణ వ‌స్తే ఏమ‌వుతుంది అని క‌ల‌లు క‌న్నామో ఆ క‌ల ఏమైంది. ఇప్పుడు ఏం జ‌రుగుతోంది. కేవ‌లం ఒక కుటుంబం మాత్ర‌మే ల‌బ్ధి పొందుతోంది. నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు లేవు. రైతు సోద‌రులు చాలామంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వారి కుటుంబాల‌కు, వేదిక పై ఉన్న ఈ రైతు కుటుంబాలే కాదు. నెల‌కు వెయ్యి మంది వ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. వీరి కుటుంబాల‌కు ఎవ‌రు స‌మాధానం చెబుతారు అని అడుగున్నా.. అని రాహుల్ గాంధీ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ‌లు సందించారు.’’

Advertisement

తాజా వార్తలు

Advertisement