Sunday, May 19, 2024

Breaking: తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి రాజులాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు : రాహుల్‌ గాంధీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఒక రాజులా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజు, ముఖ్య‌మంత్రి అనే ప‌దాల్లో, వ్య‌వ‌హారంలో వ్య‌త్యాస‌ముంది. ముఖ్య‌మంత్రి అనే వారు ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వ్య‌క్తిగా ప‌రిపాల‌న చేస్తారు. రాజు అనే వారు త‌న సొంత ప‌నుల గురించే త‌ప్పా, ప్ర‌జ‌ల గురించి ఆలోచించ‌లేర‌ని చెబుతున్నా. ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల మాట‌లు విని ప‌రిపాల‌న సాగిస్తారు. రాజు అనే వారు త‌న సొంత ఆలోచ‌న‌ల‌తో పాల‌న చేస్తారు.

ఛ‌త్తీస్‌గ‌ఢ్ కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం వ‌చ్చే ముందు రెండు ఎన్నిక‌ల హామీలిచ్చాం. ఒక‌టి రైతుల రుణ‌మాఫీ, రెండోది పండించిన పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర 2500 వ‌ర‌కు క్వింటాకు వ‌రిధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో రైతులు చెప్పారు. 2500 ధ‌ర ఇవ్వాల‌ని కోరారు. ఇప్పుడు అక్క‌డ ఎలా ఉందో తెలుసుకోండి. అంత మ‌ద్ద‌తు వ‌స్తుందో లేదో క‌నుక్కోండి. ఇక్క‌డ ముఖ్య‌మంత్రి ఇద్ద‌రు లేదా ముగ్గురు వ్యాపారుల మాట వింటున్నారు. రైతుల ప‌క్షాన నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర అంద‌డం లేదు. అని రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement