Monday, April 29, 2024

Petrol Scam | పెట్రోల్ బంక్​లో అరాచకం.. లీటర్​ కొట్టిస్తే అరలీటరే వస్తోంది!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెట్రోల్​ బంకుల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. నియోజకవర్గంలోని దమ్మపేటలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో శనివారం ఓ వ్యక్తి స్వయంగా మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడ అక్రమాల విధానం వెలుగుచూసింది. దమ్మపేటకు చెందిన మురహరి రాంబాబు 144రూపాయల పెట్రోల్ తన ద్విచక్ర వాహనంలో కొట్టించాడు. పెట్రోల్ నింపే వ్యక్తి మీటర్ లో ఫీడ్ చేయకుండా పెట్రోల్​ పంపు చేస్తుండగా.. ఇదేంటని ప్రశ్నించాడు. దీంతో అతను తడబడుతూ సమాధానం చెప్పటంతో రాంబాబుకు అనుమానం వచ్చింది.

పెట్రోల్ బంక్ ఆవరణలోనే ఒక బాటిల్ లో బండిలోని పెట్రోల్ తీసి చూడగా.. లీటర్ బాటిల్ కూడా నిండలేదు. ఇదేమిటని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పటంతో పెట్రోల్ బంక్ వద్ద బాధితుడు ఆందోళనకు దిగాడు. ఈ విషయంలో బంక్​ యాజమాన్యం ఎలాంటి రెస్పాన్స్​ తీసుకోలేదు. ఇదెలా జరిగిందో తమకు తెలియదని అక్రమాలపై తప్పించుకునే యత్నం చేశారు. దీనిపై అధికారులు విచారణ జరిపి పెట్రోలు, డీజిల్​ అక్రమాలు జరగకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement