Thursday, April 25, 2024

ఇంటి మ‌ధ్య‌లో ఇప్ప చెట్టు .. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు ..

ప్ర‌కృతికి చెట్లే ఆధారం..స్వ‌చ్చ‌మైన గాలిని అందించ‌డంలో చెట్ల‌ది ఎన‌లేని పాత్ర‌.. అందుకే తెలంగాణలో మొక్క‌లు నాట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం నిర్విరామంగా కొన‌సాగుతోంది. అయితే గృహ నిర్మాణాల‌కు చెట్లు అడ్డంగా ఉంటే ఏ మాత్రం ఆలోచించ‌కుండా వాటిని న‌రికేస్తుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌ చెందిన ఆర్యన్‌ మహారాజ్‌ అనే వ్యక్తి మాత్రం త‌న స్థ‌లంలోని భారీ చెట్టుని న‌ర‌క‌కుండానే ఇల్లు క‌ట్టుకుని ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. అంతేకాదు, కాంక్రీటు వల్ల చెట్టు ఎదగదన్న ఉద్దేశంతో ఆయ‌న‌ వెదురుబొంగులు, చెక్కలు, పెంకులతో గది పైకప్పును ఏర్పాటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఆయ‌న‌పై ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు, నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. చెట్టు కోసం ఇంటి డిజైన్‌ను మార్చుకుని మ‌రీ ఇంటిని క‌ట్టాడు. కొన్ని నెలల క్రితం ఇంటి నిర్మాణం చేప‌ట్టాడు. తాజాగా అది పూర్త‌యింది. త‌న‌ స్థలంలోని ఓ ఇప్ప చెట్టు సరిగ్గా ఇంటి మధ్యలోకి వస్తుండటంతో ఇంటి ఆకృతిని మార్పు చేసి, చెట్టును కొట్టేయ‌కుండా అలాగే ఉంచి మిద్దెమీదికి వెళ్లేందుకు వీలుగా ఓ చిన్నగదిని నిర్మించుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement