Friday, May 3, 2024

బిగ్ బాస్ కి అంత‌రాయం – నేటి అర్థ‌రాత్రి నుండి స్ట్రీమింగ్ ప్రారంభం

డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీలో బిగ్ బాస్ షో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే స్ట్రీమింగ్ కు సంబంధించి ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని ప్రేక్ష‌కులు మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకువ‌చ్చార‌ట‌. దాంతో అందరినీ నిరాశపరుస్తూ నిన్న అర్ధరాత్రి నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిలిపివేసింది. ఒక్కసారిగా షో ఆగిపోవడంతో ప్రేక్షకులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. షో ఎందుకు ఆగిపోయిందో హాట్ స్టార్ వెల్లడించలేదు. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్ ను ప్రారంభిస్తామని తెలిపింది. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ కొత్త వర్షన్ ను షో మేనేజ్ మెంట్ ప్రారంభించింది. నాన్ స్టాప్ బిగ్ బాస్ ఫిబ్రవరి 26న గ్రాండ్ గా లాంచ్ అయింది. 17 మంది కంటెస్టెంట్లతో 24 గంటల పాటు 84 రోజులు ఈ షో ప్రసారంకానుంది. నాన్ స్టాప్ బిగ్ బాస్ కు కూడా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement