Saturday, April 20, 2024

నేడు మూడు దేశాల అధినేతలతో ప్ర‌ధాని మోడీ కీలక భేటీ

గ‌త వారం రోజులుగా రష్యా-ఉక్రెయిన్​ వార్ కొన‌సాగుతోంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ ప‌లు దేశాల‌పై ప‌డ‌నుంది. ఈ నేపథ్యంలో క్వాడ్ దేశాధినేతల భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఈరోజు సమావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో ప‌లు కీలక చర్చలు జరపనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలపై ప్రధానంగా వీరు సమాలోచనలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ర‌ష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement