Sunday, May 19, 2024

Hyderabad: ఇంటింటా ఇన్నోవేటర్‌, కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఆహ్వానం: కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌

ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్‌.. సరికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు, స్టూడెంట్స్‌లో సృజ‌నాత్మ‌క‌త‌ను వెలుగులోకి తెస్తోంది. దీనికి విద్యార్థులతో పాటు అన్ని వ‌ర్గాల‌ నుంచి ఆహ్వానాలు కోరుతున్న‌ట్టు హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ అమోయ్‌ కుమార్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని యావ‌త్ తెలంగాణ వ్యాప్తంగా వ‌చ్చే ప్రాజెక్టుల‌ను స్ర్కూటినీ చేసి బెస్ట్ ప్రోగ్రామ్స్‌ని ఎంపిక చేసి ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచ‌బోతున్న‌ట్టు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారిణి (డీఈవో) ఆర్‌.రోహిణి, జిల్లా సమన్వయ కర్త సి.ధర్మేందర్‌ రావుతో కలిసి శుక్రవారం ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌: ఇంటింటా ఇన్నోవేటర్‌ వంటి కార్యక్రమాలు నూతన ఆవిష్కరణలకు దోహదపడతాయని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌ కార్యాయలంలో శుక్రవారం రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇట్లాంటి కార్య‌క్ర‌మాలు విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణల వంటి అంశాల‌ను, సృజనాత్మక విలువలను వెలికితీస్తాయన్నారు. ఇన్నోవేషన్‌, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆవిష్కరణలు రానున్న‌ట్టు తెలిపారు. ఈ ప్రదర్శనల‌కు అన్ని వర్గాల ఆవిష్కరణల ప్రోత్సహించ‌నున్న‌ట్టు చెప్పారు. గ్రామీణ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలతో పాటు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనల నుంచి వచ్చిన వాటిని కూడా స్వీక‌రిస్తామ‌న్నారు.

కాగా, ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలకు సంబంధించిన ఆరు వ్యాఖ్యాలు, రెండు నిమిషాల వీడియోతో పాటు ఆవిష్కరణకు చెందిన ఆరు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, జిల్లా పేరు, ఫోన్‌ నంబరు, వయస్సు, ప్రస్తుత వృత్తి తదితర వివరాలను 9100678543కి వాట్సాప్‌ చేయాలని కోరారు. ఇన్నోవేటర్స్‌ దరఖాస్తులను స్వీకరించడానికి వచ్చే నెల (ఆగస్టు) 5వ తేదీ దాకా చాన్స్ ఉందన్నారు. వ‌చ్చిన వాటిన‌ షార్టు లిస్టు చేసిన తర్వాత ప్రతి జిల్లా నుంచి ఐదు ఆవిష్కరణలు ఎంపిక చేస్తామ‌ని ఇన్‌చార్జి క‌లెక్ట‌ర్ అమోయ్‌కుమార్ వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు జిల్లా సమన్వయ కర్త సి.ధర్మేందర్‌ రావును 7799171277లలో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేటర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ విషయం తెలిసిందేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement