Sunday, April 28, 2024

Big Breaking | ఎయిర్​బస్​తో ఇండిగో మెగా డీల్​.. 500 విమానాల కొనుగోలుకు ఆర్డర్​

బడ్జెట్ క్యారియర్ ఇండిగో, ఎయిర్​బస్​ మధ్య మెగా డీల్​ కుదిరింది.  ఎయిర్​ బస్​ నుంచి 500 విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో  నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఆర్డర్‌ను ఇస్తున్నట్లు ఇవ్వాల (సోమవారం) ప్రకటించింది. కాగా, ఎయిర్‌బస్‌తో ఓ విమానయాన సంస్థ చేసిన అతిపెద్ద డీల్​ కూడా ఇదే కావడం గమనార్హం.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఈ ఏడాది ప్రారంభంలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 470 విమానాలు, బోయింగ్​ల కోసం ఎయిర్​బస్​కు ఆర్డర్​ చేసింది. ప్రస్తుతం ఇండిగో 300 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. ఇంతకుముందు 480 విమానాల ఆర్డర్‌లను ఇచ్చినా అవి ఇంకా డెలివరీ కాలేదు.

కాగా, 2030-2035 నాటికి మరో 500 ఎయిర్‌క్రాఫ్ట్ ల ఆర్డర్‌తో ఇండిగో ఆర్డర్ బుక్‌లో దాదాపు 1,000 విమానాలు ఉన్నాయి. రాబోయే దశాబ్దంలో ఇవన్నీ డెలివరీ కావలసి ఉందని ఎయిర్‌లైన్ అధికారులు తెలిపారు. ఇండిగో ఆర్డర్ బుక్ ప్రకారం.. A320 NEO, A321 NEO , A321 XLR విమానాలను ఆర్డర్​ చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement