Wednesday, May 1, 2024

కెన‌డాలో భార‌తీయ విద్యార్థి మృతి – చివ‌రి చూపుకోసం ఎదురుచూస్తోన్న త‌ల్లిదండ్రులు

త‌ను ప‌ని చేసే రెస్టారెంట్ కు వెళుతుండ‌గా టొరొంటో న‌గ‌రంలోని స‌బ్ వే ఎంట్ర‌న్స్ వ‌ద్ద గుర్తు తెలియ‌ని వ్య‌క్తి కాల్పులు జ‌రిపాడు. దాంతో తీవ్ర‌గాయాల‌తో ప‌డి ఉన్న కార్తీక్ ని పారా మెడిక‌ల్ ప్ర‌థ‌మ చికిత్స అందించి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ చికిత్స పొందుతూ ప్రాణాలు వ‌దిలాడు.దాంతో కెనాడోలోని టొరొంటోలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ మృతి చెందడం కలకలం రేపింది. అతడి చివరి చూపు కోసం తల్లిదండ్రులు బంధువులు ఇప్పుడు భారత్ లో ఎదురుచూస్తున్నారు.కెనడాలోని భారత హైకమీషన్ అధికారులు కార్తీక్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాల్పుల ఘటనలో కార్తీక్ వాసుదేవ్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ కు తరలించేందుకు అతడి కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నట్టు ఇండియన్ హైకమీషన్ ఒక ప్రకటనలో తెలిపింది. జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు కానరానీ లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వాళ్లను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించి డిజిటల్ మార్కెటింగ్ లో పనిచేయాలనే లక్ష్యంతో మూడు నెలల క్రితమే తమ బిడ్డ కెనడాకు వెళ్లాడని.. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement