Saturday, April 27, 2024

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవిలో 574 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు రైల్వే అధికారులు శుభవార్త అందించారు. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించారు. ముంబై, పూణే, నాగ్‌పూర్, షిర్డీ నుండి  వేసవి స్పెషల్‌ రైళ్లు నడిపించనున్నారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు ప్రయాణీకుల అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకుని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై, లోకమాన్య తిలక్ టెర్మినస్ పన్వెల్, పూణే, నాగ్‌పూర్, సాయినగర్ షిర్డీ నుండి వివిధ గమ్యస్థానాలకు రైళ్లు నడుస్తాయి. ఇందులో తిరుపతి-హైదరాబాద్‌, తిరుపతి-ఔరంగాబాద్‌ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈనెల 30 నుంచి వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతుందని మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వెల్లడించారు. ఈ రైలు ఏప్రిల్‌ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా తిరుపతి-హైదరాబాద్‌ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుందని మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌ చేరకుంటుందని వెల్లడించారు. ఈ సర్వీసు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు.

ఇక తిరుపతి-ఔరంగాబాద్‌ (07511) స్పెషల్‌ ట్రెయిన్‌ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్‌ చేరుకుంటుందని చెప్పారు. ఇది మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుందని వివరించారు. ఔరంగాబాద్‌ (07512) నుంచి సోమవారం(మే 2) రాత్రి 11.15 గంటలకు బయలుదేరుతుందని మరుసటి రోజు రాత్రి 10.15 గంటలకు తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. ఇది మే 2, 9, 16, 23, 30 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు. కాగా, ఈ రైలు సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర మీదుగా వెళ్తాయని చెప్పారు.

ఈ కొత్త రైళ్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, మన్మాడ్, నాగ్‌పూర్, మాల్దా టౌన్, రేవా మధ్య 126 వేసవి ప్రత్యేక రైళ్లు ఉంటాయి. లోకమాన్య తిలక్ టెర్మినస్, షాలిమార్, బల్లియా, గోరఖ్‌పూర్, సమస్తిపూర్, థివిమ్ మధ్య 282 సమ్మర్ స్పెషల్స్ నడుస్తాయి. పన్వెల్ -కర్మాలి మధ్య 18 సమ్మర్ స్పెషల్స్ నడుస్తుండగా, నాగ్ పూర్- మడ్గావ్ మధ్య 20 సమ్మర్ స్పెషల్స్ అందుబాటులో ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement