Sunday, April 28, 2024

వింటర్​ ఒలింపిక్స్​ ని బాయ్​కాట్​ చేసిన ఇండియా.. గాల్వాన్​ ఘటనే ప్రధాన కారణం..

బీజింగ్ లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కానీ, ముగింపు వేడుకలకు కానీ భారత్​ తరఫున రాయబారి హాజరుకాబోరని మినిస్ట్రీ ఆఫ్​ ఎక్స్​టర్నల్​ అఫైర్స్​ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చయోన్​ చెప్పారు. 2022 వింటర్ ఒలింపిక్స్ కు గాల్వాన్ సైనికుడిని టార్చ్ బేరర్‌గా చైనా తయారు చేస్తుందన్న నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒలింపిక్స్ ను రాజకీయం చేయడానికి చైనా ఎంచుకోవడం విచారకరం అన్నారు.

గత ఏడాది జూన్​లో గాల్వాన్​ లోయలో భారత బలగాలపై దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు క్విఫాబావోని ఇండియన్​ సోల్జర్స్​ పట్టుకున్నారని ఓ​ వార్తా సంస్థ ఇన్వెస్టిగేషన్​ రిపోర్ట్​లో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం..  గత ఏడాది జూన్ 15-16 తేదీల  మధ్య చీకట్లో గాల్వాన్ నదిని దాటడానికి 38 మంది చైనా సైనికులు ప్రయత్నించారు. అప్పుడు భారత,  చైనా దళాల మధ్య ముఖాముఖిగా పోరాటం జరిగింది. కాగా, భారత బలగాలపై దాడికి పాల్పడ్డ​ చైనా దళానికి క్వి ఫాబావో నాయకత్వం వహించాడు. ఈ సందర్భంగా జరిగిన పోరాటంలో గాల్వాన్ వ్యాలీలో మోహరించిన భారత బలగాల్లో స్నో లెపార్డ్ అయిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు ఈ ఆపరేషన్ లో మరణించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement