Saturday, May 4, 2024

Omicron: దేశంలో 358 ఒమిక్రాన్ కేసులు.. రాష్ట్రాల వారీగా లెక్క ఇదే

భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చేప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 358 కేసులు నమోదు అయినట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో 114 మంది బాధితులు కోలుకున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రాల్లో అత్యధికంగా 88 కేసులు నమోదు అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 67, తెలంగాణలో 38, తమిళనాడులో 34, కర్ణాకటలో 31, గుజరాత్ లో 30, కేరళలో 27, రాజస్థాన్ లో 22, హర్యానా, ఒడిశాలో 4, జమ్మూకశ్మీర్, వెస్ట్ బెంగాల్ లో 3 కేసులు కేసుల చొప్పున నమోదైయ్యాయి. ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లో రెండు చొప్పున, చత్తీస్ గఢ్, లడాఖ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.

మరోవైపు ఒమిక్రాన్‌ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్‌ కట్టడికి చర్యలు చేపట్టే విధంగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఒమిక్రాన్ నియంత్రణకు పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఢిల్లీలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం విధించింది. మధ్యప్రదేశ్ లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధించారు. గుజరాత్‌లోని 8 నగరాల్లో నైట్‌ కర్ప్యూ విధిస్తూ ఆరాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement