Friday, May 17, 2024

భారత్‌లో 4.12 లక్షల మంది కోటీశ్వరుల కుటుంబాలు

ఇండియాలో పేదలు ఇంకా పేదలుగా ఉంటుంటే.. ధనికులు మాత్రం ఇంకా ధనికులుగా మారుతున్నారు. దేశంలో ఒకవైపు పేదరికం వెక్కిరిస్తున్నా కానీ మరోవైపు మిలియనీర్లు పెరిగిపోతున్నారు. హురున్ ఇండియా సంపద నివేదిక -2021 ప్రకారం ఇండియాలో 4.12 లక్షల మిలియనీర్ కుటుంబాలు ఉన్నాయని వెల్లడించింది. రూ.7 కోట్ల సంపద కుటుంబాలు ఉన్న జాబితాలో ముంబై అగ్రస్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండో స్ధానంలో ఉంది. ఈ మిలియనీర్లు తమ రాబడిని షేర్లు, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేందుకే వీరు మొగ్గు చూపుతున్నారని నివేదిక తెలిపింది.

హురున్‌ రిచ్‌ జాబితాలో తొలి పది ర్యాంకుల్లో ఉన్న రాష్ట్రాల్లోనే 70.3 శాతం మిలియనీర్లు ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 56 వేల మంది మిలియనీర్లు ఉండగా యూపీలో 36వేల మంది, తమిళనాడులో 35 వేల మంది, కర్ణాటకలో 33 వేల మంది, గుజరాత్‌లో 29 వేల మంది మిలియనీర్లు ఉన్నారు. ముంబై నగరంలో ఏకంగా 16,933 మంది మిలియనీర్‌ కుటుంబాలు ఉండగా.. న్యూఢిల్లీలో 16 వేల మంది మిలియనీర్లు ఉండగా కోల్‌కతాలో 10 వేల మంది మిలియనీర్లు కొలువుతీరారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక భారత మిలియనీర్లలో అత్యధికులు లగ్జరీ కార్‌ బ్రాండ్‌గా మెర్సిడెస్‌ బెంజ్‌ వైపు చూస్తుండా ఆ తర్వాత బీఎండబ్ల్యూ, జాగ్వర్‌లు నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement