Saturday, March 23, 2024

లాలాజలంలో బ్యాక్టీరియా ఉండటమే కారణమన్న వైద్యులు

మూగజీవాలను చాలామంది ప్రేమగా పెంచుకుంటుంటారు. విశ్వాసం చూపే కుక్కలను మనుషులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సాధారణంగా కుక్కలు నాకుతూ తమ యజమానులపై ప్రేమను చాటుకుంటాయి. కానీ యూరప్‌లో విచిత్రం చోటుచేసుకుంది. కుక్క ప్రేమ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. యూరోప్‌లో 63 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా కండరాల నొప్పి, జ్వరంతో పాటు ముఖం, శరీరం మీద బొబ్బలతో అనారోగ్యం పాలయ్యాడు. శ్వాస తీసుకోవడమే కష్టంగా మారడంతో 16 రోజులు పోరాడి అంతుచిక్కని వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. అయితే వైద్యుల విచారణలో ఆసక్తికర విషయం బయటపడింది. కుక్క లాలాజలంలోని క్యాపానోసేటోఫ అనే బాక్టీరియా కారణంగా ఆ వ్యక్తి మరణించాడని వైద్యులు తేల్చిచెప్పడంతో అంతా షాక్ తిన్నారు. కుక్క ముఖాన్ని నాకినప్పుడు అది శరీరంలోకి చేరి అతడి ప్రాణాలనే తీసింది. ఈ బ్యాక్టీరియా ప్రతి 1.5 మిలియన్ల మందిలో ఒకరికి మాత్రమే సోకుతుందని ఓ అధ్యయనం పేర్కొంది. దీని కారణంగా 28 శాతం నుంచి 31 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్టు వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement