Tuesday, April 30, 2024

క‌రోనా అప్డేట్‌: దేశంలో స్వల్పంగా తగ్గిన కేసులు

ఇండియాలో రోజువారి క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. సెకండ్ వేవ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌దని…రాబోయే 4నుంచి 6 వారాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్త‌గా 26,041 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,36,78,786కి చేరింది. ఇందులో 3,29,31,972 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,99,620 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 276 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 4,47,194 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 29,621 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 38,18,362 మంది టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 86,01,59,011 మంది టీకాలు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: GULAB EFFECT: తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్ లో హై అలర్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement