Tuesday, May 14, 2024

Good News: ఇండియాలో కరోనా ఖతం.. వెయ్యికి దిగువన కేసులు

దేశంలో కరోనా దాదాపు అదుపులోకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు రెండు వేల లోపు నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు వెయ్యికి చేరింది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 913 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్‌ కేసులు వెయ్యిలోపు నమోదవడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా  బాధితులు సంఖ్య 4,30,29,044కు చేరింది. ఇందులో 4,24,95,089 మంది బాధితులు కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో 13 మంది కరోనాతో మృతి చెందగా.. 1316 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో 5,21,358 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 12,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,84,70,83,279 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement