Thursday, May 2, 2024

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో – సినీ తార‌ల కాల్ డేటా ఉందంటోన్న ఎక్సైజ్ శాఖ‌

మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు. ప‌లువురి కాల్ డేటాని ఎక్సైజ్ శాఖ బ‌య‌ట‌పెట్టింది. ఈ కేసుని లోతుగా ద‌ర్యాప్తు చేస్తోంది ఈడీ. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో ఆడియో , వీడియో రికార్డింగ్స్ మాయం అయ్యాయి. 2017 లో టాలీవుడ్ స్టార్స్ తో పాటు మొత్తం 41 మంది కాల్ డేటా రికార్డింగ్స్ నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ.. వీరిపై 2017 లో 12 ఎఫ్ ఐ ఆర్లు నమోదు చేసింది. డ్రగ్స్ నిందితుల తో పాటు సాక్షుల నుండి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఈడి కి ఎక్సైజ్ సుపరిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. విచారణ సందర్భంగా అందరి కాల్ డేటా రికార్డింగ్స్ చేసిన ఎక్సైజ్ శాఖ.. నిందితుడు కెల్విన్ మొబైల్ ఫోన్ ను సైతం సీజ్ చేసింది.కెల్విన్ తో స్టార్స్ కు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్ బయటికి తీసిన ఎక్సైజ్ శాఖ… ఈడీ మాత్రం ఆ కాల్ రికార్డింగ్స్ ఇవ్వలేదు. ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ ల తో పాటు,ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్ ను ఇవ్వాలని కోరిన ఈడీ.. వాటి వివరాలు ట్రైల్ కోర్ట్ లో ఉన్నాయని తెలిపింది ఎక్సైజ్ శాఖ. కోర్ట్ కు ఎక్సైజ్ శాఖ సమర్పించిన వాంగ్మూల కాపీలు మాత్రమే అందాయి అంటోంది ఈడీ. అందులో కాల్ డేటా రికార్డింగ్స్ లేవని ఈడీ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement