Saturday, April 27, 2024

నివేదితా బ్యాక్ స్టెప్!

నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సాగర్ టికెట్ దక్కకపోవడంతో బీజేపీకి గుడ్ బై చెప్పి.. టీఆర్ఎస్ లో చేరిపోయారు కడారి అంజయ్య. తాజాగా బీజేపీ నాయకురాలు నివేదితా రెడ్డి టీఆర్ఎస్‌లో చేరాలని ప్రయత్నిస్తుండడం బీజేపీకి మింగుడు పడడం లేదు. బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి నిమిషం వరకు ఎటూ తేల్చుకోలేదు. ప్రధానంగా టీఆర్ఎస్ అసంతృప్తుల మీదనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. టీఆర్ఎస్ చాలా వ్యూహత్మకంగా అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యవహరించింది. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు సీఎం కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించినవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుజ్జగించారు.

బీజేపీలో టిక్కెట్ దక్కని వారిపై సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేత కడారి అంజయ్యతో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపారు. దీంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. మరో బీజేపీ నేత నివేదితారెడ్డి కూడా సాగర్ టికెట్ తనకే వస్తుందని ఆశించారు. ఈ మేరకు నామినేషన్ కూడా వేశారు. అయితే, రవికుమార్ నాయక్‌కు టిక్కెట్ ఇవ్వడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆమె కూడా టీఆర్ఎస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఉపఎన్నికలో భారీ నష్టం తప్పదని గ్రహించిన బీజేపీ… నివేదితాను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. తర్వలో ఏదైన పదవి ఇస్తామనే హామీ కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement