Monday, April 29, 2024

IMDb టాప్ 10సినిమాల జాబితా.. సత్తా చాటిన సౌత్ ఇండియన్ సినిమాలు

2022సంవత్సారానికి సంబంధించి టాప్ 10ప్రముఖ ఇండియన్ సినిమాల జాబితాను విడుదల చేసింది IMDb . ఈ జాబితాలో తమిళ హీరో ధనుష్ తో పాటు …మన సౌత్ స్టార్స్ ఆధిపత్యం ను ప్రదర్శించిన విషయం తెల్సిందే. ఇప్పుడు టాప్ 10 ఇండియన్ మూవీస్ జాభితాలో కూడా సౌత్ ఇండియన్ సినిమాల ఆధిపత్యం క్లీయర్ గా కనిపిస్తుంది. మొత్తం 10 సినిమాల్లో కశ్మీర్ ఫైల్స్ .. రాకెట్రీ సినిమాలు కాకుండా అన్ని కూడా సౌత్ ఇండియన్ సినిమాలే అవ్వడం విశేషం. ఈ ఏడాది మేటి సినిమా గా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా నెం.1 స్థానంలో నిలిచింది. నెం.2 స్థానంలో హిందీ సినిమా కశ్మీర్ ఫైల్స్ నిలిచింది.

మూడవ స్థానం లో కన్నడ సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ 2 ఉండగా నాల్గవ స్థానంలో తమిళ మూవీ విక్రమ్ నిలిచింది. ఆ తర్వాత వరుసగా కాంతార.. రాకెట్రీ.. మేజర్.. సీతారామం.. పొన్నియన్ సెల్వన్ 1.. 777 చార్లీ సినిమాలు ఉన్నాయి. ఈ జాబితాలో తెలుగు సినిమాలు మూడు ఉండగా కన్నడ సినిమాలు మూడు ఉన్నాయి. తమిళ సినిమాలు రెండు మరియు హిందీ సినిమాలు రెండు టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి. ఈ సారి జాబితాలో తెలుగు మరియు కన్నడ సినిమాల యొక్క ఆధిపత్యం స్పష్టంగా కనిపించడంతో బాలీవుడ్ పై మరోసారి సౌత్ సినీ పరిశ్రమ యొక్క ఆధిపత్యం కనిపిస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement