Tuesday, May 21, 2024

బయటపడిన అక్రమ సంబంధం..భార్యని కారుతో తొక్కించి చంపేందుకు యత్నించిన నిర్మాత

అక్రమ సంబంధం బయటపడేసరికి భార్యని కారుతో తొక్కించి చంపేందుకు యత్నించాడు నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా..తన భర్త ఇంట్లో కనిపించకపోవటంతో అతన్ని వెతుక్కుంటూ అతని భార్య కారు పార్కింగ్‌ దగ్గరకు వెళ్లింది. అక్కడ కారులో మరో మహిళతో భర్త సన్నిహితంగా ఉండటాన్ని గమనించి కోపం పట్టలేకపోయింది. ఈ విషయంపై నిలదీసేందుకు వెళ్లి.. భర్తను కారు నుంచి బయటకు రావాలంటూ అరిచింది. దీంతో కంగారు పడ్డ కిషోర్ కారుని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. కారు డీకొని ఆమె కింద పడినా కూడా పట్టించుకోకుండా కాళ్ల మీద నుంచి కారుని పోనిచ్చాడు. అయితే దగ్గరలోని మరో వ్యక్తి వచ్చి ఆమెను బయటకు లాగి కాపాడాడు. కిషోర్ మిశ్రా భార్య తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. భర్త తనను కారుతో తొక్కించి చంపడానికి ప్రయత్నించాడని ఆమె అంబోలి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాత కిషోర్ తన భార్యను కారుతో తొక్కించిన వీడియో బయటకు వచ్చింది. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement