Sunday, May 5, 2024

IHU Variant: ఫ్రాన్స్ లో మ‌రో కొత్త రకం క‌రోనా గుర్తింపు

ప్రపంచ దేశాల‌ను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క‌ల‌వ‌రపెడుతోంది. ఈ త‌రుణంలో మ‌రో కొత్త ర‌కం వైరస్ ని ఇన్‌స్టిట్యూట్ హాస్పిటలో యూనివర్సిటైర్స్ (IHU)ను ఫ్రాన్స్ లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్రాన్స్ లోని యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు దీన్ని క‌నుగొన‌డంతో ఆ వ‌ర్సిటీ పేరు తోనే దీనికి నామకరణం చేశారు.

ఒమిక్రాన్‌తో పోలిస్తే ఈ వేరియంట్ జన్యు సంకేతంలో 46 ఉత్పరివర్తనాలు చేర‌గా 37 తొలగిపోయాయి. వీటిలో చాలా వరకు స్పైక్ ప్రోటీన్‌ను ప్రభావితం చేస్తాయని తెలిపారు. 2021 న‌వంబ‌ర్‌లో ఆఫ్రికాలోని కామెరున్ నుంచి తిరిగి వ‌చ్చిన వ్యక్తిలో ఈ ర‌కాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఇలాంటి కేసులు ఫ్రాన్స్ లో మాత్రమే 12 వ‌ర‌కు న‌మోద‌య్యాయి. కాగా, ఈ ర‌కం కేసులు ఇంకా ఏ దేశంలోనూ గుర్తించ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement