Monday, April 29, 2024

అచ్చు ‘స్పైడ‌ర్ మ్యాన్’ లా ఊస‌ర‌వెల్లి

ఇటీవ‌ల కాలంలో ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారులు త‌మ‌కు క‌నిపించిన వింత‌లు, విశేషాల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్నారు. కాగా ఐఎఫ్ ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేసిన ఫొటో చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఎందుకంటే అచ్చు స్పైడ‌ర్ మ్యాన్ ని త‌ల‌పించేలా ఓ జంతువు ఉంది. ఎరుపు, నీలం రంగుల్లో ఉన్న ఊస‌ర‌వెల్లి ఫొటోని ఆయ‌న షేర్ చేశారు. దాని పేరు మ్వాంజా ఫ్లాట్ హెడెడ్ రాక్ అగ‌మా అని తెలిపారు. అయితే ప‌లువురు స్పైడ‌ర్ మ్యాన్ అగ‌మా అని పిలుస్తార‌ట‌. అయితే స్పైడ‌ర్ మ్యాన్ లాగే ఇది కూడా గోడ‌ల‌పై పాకుతుంద‌ని సుశాంత‌నంద వెల్ల‌డించారు. ఈ ఫొటో చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement