Friday, April 26, 2024

నవ్వులు పూయించిన ఆ కుక్కకి ఐసీసీ అవార్డు..

ఐసీసీ ప్రతినెల క్రికెటర్లకు పురస్కరాలు ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ సారి ఓ శునకానికి అదృష్టం వరించింది. ఐసీసీ పురస్కారం శునకానికా.. అని ఆశ్చర్యపోకండి. ఇది నిజంగా నిజమే. అయితే, ఈసారి అందులో శునకం కూడా చోటు సంపాదించుకుంది. ఓ ప్రత్యేక పురస్కారంతో ఐసీసీ దానిని సత్కరించింది. ఇంతకీ ఏం  జరిగిందంటే.. ఐర్లండ్‌లో ఓ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి దూసుకొచ్చిన ఓ శునకం బంతిని నోటితో పట్టుకుని పరుగులు తీసింది. దానిని అలా పట్టుకుని పరిగెడుతూ చివరికి బ్యాటర్ వద్దకెళ్లి ఆ బంతిని ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో స్పందించిన ఐసీసీ.. బ్యాటర్‌కు బంతి అందించిన అందరి మనసులు చూరగొన్న ఆ శునకాన్ని ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. నోటితో బంతి, తలపై టోపీతో ఉన్న శునకం ఫొటోను ఐసీసీ ఈ సందర్భంగా షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement