Saturday, April 27, 2024

ఇది విన్నారా..గర్ల్ ఫ్రెండ్ ను సెట్ చేయ్యాలని ఎమ్మెల్యేకు లేఖ..

ఎమ్మెల్యేల‌కు తమ సమస్యలు చెప్పుకుంటూ సామాన్యులు విన‌తి ప‌త్రాలు రాస్తుంటారు .  ఆ ప‌త్రాల‌ను ప‌రిశీలించి తగిన చ‌ర్య‌లు తీసుకుంటూ ఉంటారు ప్రజాప్రతినిధులు. అయితే, మ‌హారాష్ట్ర‌లోని చంద్రాపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతేకు ఓ యువ‌కుడి విచిత్ర‌మైన లేఖ రాశాడు. తనకు గర్ల్ ఫ్రెండ్ ని వెతికి పెట్టాలని ఏకంగా ఎమ్మెల్యకే లేఖ రాశాడు. అల్లరిచిల్లరగా, జులాయిగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ తనను మాత్రం ఎవరూ ఇష్టపడడం లేదంటూ ఓ యువకుడు వాపోయాడు. అమ్మాయిలు తనను ఇష్టపడకపోవడంతో తనలో ఆందోళన పెరిగి ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని పేర్కొన్నాడు. తనకో గాళ్‌ఫ్రెండ్‌ను చూసిపెట్టాలంటూ ఓ యువకుడు మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు లేఖ రాశాడు. ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. భూషణ్ జామువంత్ అనే యవకుడు మరాఠీలో ఈ లేఖ రాశాడు.

మ‌రాఠిలో రాసిన ఆ లేఖ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ లేఖపై ఎమ్మెల్యే సుభాష్ సానుకూలంగా స్పందించారు. గతంలో తనకెప్పుడూ ఇలాంటి లేఖలు రాలేదని పేర్కొన్నారు. సుభాష్ ఎక్కడ ఉంటాడో తనకు తెలియదని, అతడి సమాచారాన్ని తెలుసుకునే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించినట్టు చెప్పారు. ఇలాంటి ఉత్తరాలు రాయడం సరికాదని, అతడి ఆచూకీ తెలిస్తే పట్టుకుని కౌన్సెలింగ్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: బ్లాక్ కలర్ బెంజ్ కారులో రామ్ చరణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement